
ఫేస్‌బుక్‌కి మరో సవాల్, సరికొత్తగా దూసుకొచ్చిన ఆర్కుట్ హల్లో.. మీకు ఆర్కుట్ గుర్తుందా?ఫేస్‌బుక్ రాకముందు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపిన దిగ్గజం. సోషల్ మీడియా అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ఆర్కుట్. 2004లో గూగుల్ నుంచి వచ్చిన ఆర్కుట్ సుమారు దశాబ్దకాలం పాటు తిరుగులేని సామాజిక మాధ్యమ వేదికగా యూజర్లను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్ వంటివి రావడంతో ఆర్కుట్ క్రమంగా తన వైభవాన్ని కోల్పోయింది. దీంతో కంపెనీ 2014 సెప్టెంబరు 30తో పూర్తిగా ఆర్కుట్ సేవలను నిలిపివేసింది. కాగా మళ్లీ తన పునర్ వైభవాన్ని అందుకునేందుకు కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా హల్లో పేరుతో సరికొత్తగా సోషల్ మీడియాలోకి దూసుకొస్తోంది. ఫేస్‌బుక్ డేటా దుర్వినియోగంపై కుదేల్ అవుతున్న నేపధ్యంలో గూగుల్ మాజీ ఉద్యోగి, ఆర్కుట్ వ్యవస్థాపకుడు బయూకాక్‌టెన్ ‘హలో' పేరుతో మరో సామాజిక మాధ్యమ వేదికను భారత్‌లో ప్రారంభించారు. ముఖ్యంగా నేటి మొబైల్ జనరేషన్‌ను దృష్టిలో పెట్టుకుని ‘హలో'ను తీసుకొచ్చారు. మీ చుట్టు పక్కల ఉన్న వారిని మీ అభిరుచులకు అనుగుణంగా దగ్గర చేసే, సానుకూలమైన సామాజిక అనుసంధాన వేద...