వాట్సప్‌లోకి కొత్తగా అదిరే ఫీచర్, డిలీట్ బాధకు ఇకపై సెలవు
సోషల్ మీడియాలో ఇప్పుడు దూసుకుపోతున్న ఏకైక ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ ఏదైనా ఉందంటే అది వాట్సప్ మాత్రమేనని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఫేస్‌బుక్ సొంతమైన రోజూ కొత్త కొత్త హంగులతో సరికొత్త ఫీచర్లతో యూజర్లను అలరిస్తూ పోతోంది. యూజర్లను కొత్త ఫీచర్లతో కట్టిపడేస్తూ తన సంఖ్యను ఇంకా పెంచుకుంటూ పోతుందే కాని తగ్గించడం లేదు. ఈ నేపధ్యంలో యూజర్లను మరింతగా ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్ తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు డిలీటైన ఫోటోలను తిరిగి తెచ్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
మీరు స్టోరేజ్ ఎక్కువై డిలీట్ చేసిన పాత ఫోటోలు కాని అలాగే వీడియోలు కాని లేక ఏదైనా పాత మీడియా కంటెంట్ కాని ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ ఫోన్లో తిరిగి తెచ్చుకునే విధంగా వాట్సప్ కొత్త ఫీచర్ రానుంది.
మీ ఫోటోలు అలాగే క్లిప్స్, జిప్ ఫైల్స్, షార్ట్ క్లిప్స్, వీడియోలు ఏవైనా సరే మీరు డిలీట్ చేసినప్పటికీ అవి వాట్సప్ స్టోర్ లో 30 రోజుల వరకు స్టోర్ అయి ఉంటాయి. మీరు 30 రోజుల లోపల వాటిని తిరిగి డౌన్లోడ్ చేసుకునే విధంగా ఉండేది. అయితే ప్రోటోకాల్ కారణంగా వాట్సప్ ఈ ఫీచర్ ని తొలగించి వేసింది.
ఇప్పుడు దీనిలో మార్పులు చేస్తూ media storage protocol ఫీచర్ ని తీసుకొస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్ డిలీట్ చేసిన ఏ ఫైల్‌నైనా ఇకపై వాట్సప్‌లో మళ్లీ పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇకపై సర్వర్ encrypted చేయబడి ఉంటుంది కాబట్టి ఎవరూ దాన్ని ఓపెన్ చేయలేరని వాట్సప్ చెబుతోంది.
ఈ ఫీచర్ ప్రస్తుతానికి కేవలం ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా వెర్షన్‌ను వాడుతున్న యూజర్లకే అందుబాటులోకి వచ్చింది. త్వరలో యూజర్లందరికీ ఈ ఫీచర్ లభ్యం కానుంది. ఐవోఎస్ యూజర్లకు కూడా త్వరలో అందుబాటులోకి రానుంది. బీటా వర్సన్ వాడుతున్న వారు Android version (2.18.113)లో ఈ ఫీచర్ పొందవచ్చు.
ఈ ఫీచర్ ఎలా పొందాలంటే యూజర్ ముందుగా తన వాట్సప్ ఛాట్ conversation లో కెళ్లి అక్కడ డౌన్లోడ్ అనే ఆప్సన్ ని టాప్ చేసి డిలీట్ చేసిన డేటాను తిరిగి పొందవచ్చు. అయితే ఈ ఆప్సన్ కేవలం బీటా యూజర్లకు మాత్రమే ఇప్పుడు కనిపిస్తోంది.
దీంతో పాటు వాట్సప్ కస్టమైజ్ షేప్, సైజుల్లో కూడా మార్పులను తీసుకురానుంది. వీటి ద్వారా వాట్సప్ హోమ్ స్క్రీన్ మీద సరికొత్త లుక్ తో దర్శనమవివ్వనుందని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్ కూడా వాట్సప్ బీటా వర్సన్ యూజర్లకి అందుబాటులో ఉంది. వారు సరికొత్తగా circle), square, squircle (rounded square), and teardropలాంటి వాటిని వాట్సప్ లో గమనించవచ్చు.
ఇప్పటికే క్యూఆర్ కోడ్ ద్వారా వాట్సప్ Unified Payment Interface (UPI) సర్వీసులను ప్రవేశపెట్టింది. దీని ద్వారా యూజర్లు మనీ ట్రాన్సఫర్ చేసుకోవచ్చు. అయితే ఇది కూడా టెస్టింగ్ దశ చివరిలో ఉంది. అతి త్వరలోనే యూజర్లకి అందుబాటులోకి రానుందని వాట్సప్ తెలిపింది. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ ఫోన్ కెమెరాతో యూఆర్ కోడ్ ని స్కానింగ్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. స్కాన్ చేసిన తరువాత మీరు మీ అమౌంట్ ఎంటర్ చేస్తే సరిపోతుంది.
Comments
Post a Comment