ట్రూ కాలర్‌లో దాగిన ఆసక్తికర ఫీచర్లు ఇవే, ఓసారి చెక్ చేసుకోండి 


రోజూ మనకు ఏవేవో కొత్త నంబర్ల నుంచి ఫోన్లు వస్తుంటాయి. అవి ఎవరివో ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలియకుండా తికమక పెట్టేస్తుంటాయి. ఒక్కోసారి విసిగిస్తుంటాయి. బిజీగా ఉన్న టైంలో తెలియని నంబర్ల నుంచి కాల్ వస్తే చిరాకు పుడుతుంటుంది. అయితే వీటి నుంచి రక్షణ పొందలేమా అంటే ట్రూకాలర్ ద్వారా రక్షణ పొందవచ్చు. ట్రూకాలర్ ద్వారా అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ని ఇట్టే కనిపెట్టేయవచ్చు. అందులో ఇంకా ఎన్నో రకాలైన ఫీచర్లు ఉన్నాయి. వీటి ద్వారా మీరు మిస్టరీ కాల్స్ ని ఈజీగా పట్టేసి వాటిని బ్లాక్ చేయవచ్చు. మరి ట్రూ కాలర్ లో దాగిన ఫీచర్లు ఏంటో ఓ స్మార్ట్ లుక్కేద్దామా ?

మీరు మీ ట్రూ కాలర్ ద్వారా అపరిచితుల నుంచి వచ్చే కాల్స్ ని అలాగే ఆ నంబర్లని బ్లాక్ చేయవచ్చు. కొన్ని తెలియని నంబర్లు కొన్ని 8051 నుంచి స్టార్ట్ అవుతాయి. వాటిని పసిగట్టి బ్లాక్ చేయవచ్చు. కాల్ కట్ కాగానే మీకు బ్లాక్ ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే వెంటనే ఆ నంబర్ బ్లాక్ అవుతుంది.

మీరు ఇంటర్నట్ ఆన్ చేయకుండానే మీకు కాల్ ఎవరు చేస్తున్నారో ఇట్టే తెలుసుకోవచ్చు. ఆ నంబర్ ని ట్రూకాలర్ గుర్తించగానే మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. ఆ నంబర్ స్పామ్ అని చెబుతుంది. దాన్ని బట్టి మీరు ఆ కాల్ కట్ చేసుకోవచ్చు.

మీరు మీ మొబైల్ నుంచి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోగానే మీకు స్పామ్ ప్రొటెక్షన్ ఆటోమేటిగ్గా లభిస్తుంది. దాని ద్వారా మీరు స్పామ్ కాల్స్ వచ్చిన వెంటనే వాటిని రిజెక్ట్ చేయవచ్చు. లేకుంటే బ్లాక్ లిస్టులో పెట్టవచ్చు.
మీకు ఎవరైనా కొత్త నంబర్ నుంచి మిస్ డ్ కాల్ చేస్తే దాన్ని వెంటనే ట్రూ కాలర్ సెర్చ్ ద్వారా కనుక్కోవచ్చు. ట్రూకాలర్ సెర్చ్ లో ఆ నంబర్ ని టైప్ చేయడం ద్వారా ఆ అపరిచిత వ్యక్తుల వివరాలు మీకు కనిపిస్తాయి. అయితే అతను ట్రూకాలర్ లో ఉంటేనే వివరాలు కనిపించే అవకాశం ఉంది.

మీ పర్సనల్ ప్రొఫైల్ ఇందులో సెట్ చేసుకోవచ్చు. మీరు వివరాలను అందులో ఏం ఉంచాలనుకున్నారో అవి అవతలి వారికి మీరు కాల్ చేసినప్పుడు కనిపిస్తాయి. మీ పేరు అలాగే ఇతర వివరాలు అందులో ఎంటర్ చేస్తే ఆ వివరాలు మీరు ఎదుటివారికి కాల్ చేసినప్పుడు కనిపిస్తాయి.
మీరు మీ నంబర్ ని రిమూవ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ://www.truecaller.com/unlist ఈలింక్ లో కెళ్లి మీరు మీ నంబర్ ని రిమూవ్ చేసుకోవచ్చు. ఈ లింక్ లో కెళ్లి అక్కడ మీ నంబర్ అలాగే కంట్రీ కోడ్ ఎంటర్ చేయాలి. తరువాత నంబర్ ఎందుకు రిమూవ్ చేస్తున్నారో రాసి కాప్చా కోడ్ ఎంటర్ చేసి అన్ లిస్ట్ బటన్ ను క్లిక్ చేస్తే సరిపోతుంది

.

Comments

Popular posts from this blog

మొబైల్ ని ఎందుకు రూట్ చేయాలి? రూట్ చేయడం వల్ల కలిగే లాభలేంటి నష్టాలేంటి?

వాట్సాప్ స్టేటస్ లో వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?